ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించింది...

పద్మ దేవేందర్ రెడ్డి.....

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించింది...

కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు పిఆర్సి, ఫిట్మెంట్ ఇచ్చి కాపాడుకున్నారు....

కార్మికుల అక్రమ అరెస్టులు సరికాదు....

 

ప్రజాస్వరం : మెదక్ ,ఏప్రిల్ 23 

 

మెదక్ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మద్దతు పలికారు. గురువారం ఈ సందర్భంగా ఆమె ఆర్టీసీ కార్మికులు మెదక్ డిపో ఆవరణలో టెంట్ వేసుకొని ప్రశాంతమైన వాతావరణం లో సమ్మె చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని పట్టణ సీఐ మహేష్ ను కోరారు. అనంతరం గుల్షన్ క్లబ్ నుంచి డిపో మీదుగా తిరిగి గుల్షన్ క్లబ్ వరకు ర్యాలీ గా వెళ్ళారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని, కేవలం తూతు మంత్రంగా రాజ్యాన్ని పాలిస్తుందని చెప్పడానికి నిదర్శనమే ఆర్టీసీ కార్మికుల సమ్మె అన్నారు. గతంలో కేసీఆర్ పాలనలో ఆర్టీసీ కార్మికులకు పిఆర్సి, ఫిట్మెంట్ ఇచ్చి వారిని గౌరవాన్ని కాపాడారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు. ఆర్టీసీ కార్మికులు మిగతా డిపోల ముందు టెంట్ వేసుకొని సమ్మె చేస్తుంటే మెదక్ లో మాత్రం కార్మికులకు ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తున్నారని అన్నారు. మెదక్ లో సామరస్యంగా టెంట్ వేసుకుని సమ్మె చేస్తున్న కార్మికులను అరెస్టు చేయడం సరికాదన్నారు. ఆర్టీసీ కార్మికుల హక్కులను నెరవేర్చెంత వరకు బిఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టిసి కార్మికుల పాత్ర కీలకమని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రశాంతమైన వాతావరణంలో తమ సమ్మెను కొనసాగించే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, కౌన్సిలర్ జుబేర్, మామిళ్ళ ఆంజనేయులు, సోహెల్, నాయకులు గడ్డ మీది కృష్ణ గౌడ్, ఆర్కే శ్రీనివాస్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News

బీజేపీ శ్రేణులు ధర్నా..... బీజేపీ శ్రేణులు ధర్నా.....
ప్రజాస్వరం : మాసాయిపేట, ఏప్రిల్ 23    ప్రధాని మోదీపై మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా మాసాయిపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో...
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించింది...
పేకాట స్థావరం పై పోలీసుల దాడి.....
ఘనంగా ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయురాలు లక్ష్మి పదవి విరమణ కార్యక్రమం.....
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం.....
రోడ్డు ప్రమాదాలు జరగకుండా అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి..
నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..