కౌన్సిలర్ గుమ్మడిదల మహేశ్వరి రాజేష్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు....

కౌన్సిలర్ గుమ్మడిదల మహేశ్వరి రాజేష్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు....

మేడ్చల్, ఏప్రిల్ 8(ప్రజాస్వరం):

 

వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని కౌన్సిలర్ గుమ్మడిదల మహేశ్వరి రాజేష్ అన్నారు.బుధవారం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం 6వ వార్డులోని మెడిసిటీ చౌరస్తా వద్ద వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ

వేసవికాలంలో ఎవ్వరు కూడా మంచినీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కోవద్దననే ఉద్దేశంతోని జన సమూహం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు.ఈ వేసవికాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదై ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలు ఎండ తీవ్రత నుండి తట్టుకోవడానికి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు అన్నం వెంకటేష్,ఆకుల నాగరాజు,పిల్లిరాజు,పిల్లి సాయి,వినోద్,రాజు మున్సిపల్ సిబ్బంది గువ్వ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

కౌన్సిలర్ గుమ్మడిదల మహేశ్వరి రాజేష్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు.... కౌన్సిలర్ గుమ్మడిదల మహేశ్వరి రాజేష్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు....
మేడ్చల్, ఏప్రిల్ 8(ప్రజాస్వరం):   వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని కౌన్సిలర్ గుమ్మడిదల మహేశ్వరి రాజేష్ అన్నారు.బుధవారం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం 6వ...
శ్రీకర వెంచర్ ప్రహరీ గోడను తొలగించిన అధికారులు...
వారంతపు మార్కెట్ ను ప్రారంభించిన సర్పంచ్....
హనుమాన్ గుడికి విరాళం ఇచ్చిన సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి...
టోకెన్ల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ..
కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిని చేసిన సర్పంచ్, ఉపసర్పంచ్ ...
ఎస్ఎస్సి స్పాట్ సెంటర్ లో నిరసన.....