సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ....
By Prajaswaram
On
మెదక్ ,మార్చి 28 (ప్రజాస్వరం):
మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టణ సీఐ మహేష్ ఆధ్వర్యంలో 25 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ మహేష్ ను ఆయన అభినందించారు. సీసీ కెమెరాల ఏర్పాటు తో నేరాలు జరిగినప్పుడు త్వరితగతిన కేసులను పరిష్కరించేందుకు ఉపయోగపడతాయని అన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, పట్టణం లోని అన్ని కాలనీ ల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కు ప్రజా ప్రతినిధులు, అధికారులు సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ సీఐ మహేష్, కౌన్సిలర్ రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు భూపతి రాజ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేడిశెట్టి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
03 Apr 2026 12:41:35
జగదేవ్ పూర్ , ఏప్రిల్ 03, (ప్రజాస్వరం ): జగదేవ్ పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ...


