డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం....
తూప్రాన్, మార్చి 20( ప్రజాస్వరం ):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం చోటుచేసుకుంది. పార్టీ బలోపేతం లక్ష్యంగా, లయన్ బుడ్డ భాగ్యరాజ్ ను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ పి. మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంతో జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన లయన్ బుడ్డ భాగ్యరాజ్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు,గారికి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “మీ ప్రేమే నా బలం – మీతో ఈ బంధమే నా ఊపిరి. మీ అందరి ఆశీస్సులతో మరింత బాధ్యతగా, శక్తివంతంగా పనిచేస్తాను. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను” అని ఆయన స్పష్టం చేశారు.
అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులైన AMC మాజీ చైర్మన్ రజనకు, ప్రవీణ్ కుమార్‌కు కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ నియామకం ద్వారా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు లభిస్తుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


