కామారంలో ప్రారంభమైన క్రికెట్ లీగ్ పోటీలు....

కామారంలో ప్రారంభమైన క్రికెట్ లీగ్ పోటీలు....

చిన్న శంకరంపేట ,మార్చి 19 ( ప్రజాస్వరం):

 

చిన్న శంకరంపేట మండలం కామారంగా గ్రామంలో సర్పంచ్ సుజాత రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కామారం క్రికెట్ లీగ్ సీజన్ 1 క్రికెట్ టోర్నమెంట్ ను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కొలుకూరి రాజిరెడ్డి ప్రారంభించారు, ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఆయన టాస్ వేసి బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడలపై మొగ్గుచూపాలని చెడు మార్గాన వెళ్లకుండా మంచి ఆలోచనతో క్రీడా పోటీలలో పాల్గొని స్నేహ సంబంధాలను పెంపొందించుకోవాలని ఆయన తెలిపారు క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారుడ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు, యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా ఆయన యువతకు సూచించారు, గెలుపొందిన జట్టుకు 5వేల రూపాయల నగదు తో పాటు కప్పును అందించినట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత రమేష్ ఉపసర్పంచ్ గడీల సుధాకర్, కొరివిపల్లి సర్పంచ్ పుల్లారావు, కామారం తండా సర్పంచ్ మోహన్ నాయక్, నాయకులు రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు

Latest News

తూప్రాన్ లో ఉగాది రోజు ఐలాండ్ పునః ప్రారంభం.... తూప్రాన్ లో ఉగాది రోజు ఐలాండ్ పునః ప్రారంభం....
తూప్రాన్, మార్చి 19 (ప్రజాస్వరం ) :   పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపల్ నర్సాపూర్ చౌరస్తా వద్ద ఎంతో ప్రతిష్టత్మాకంగా ఏర్పాటు చేసిన ఐలాండ్ గత...
వర్షాలు సమృద్ధి గా కురిసి పంటలు పండుతాయి. ....
కామారంలో ప్రారంభమైన క్రికెట్ లీగ్ పోటీలు....
6 వ వార్డులో పంచాంగ శ్రావణం పాల్గొన్న కౌన్సిలర్ గుమ్మడిదల మహేశ్వరి రాజేష్....
తూప్రాన్ మున్సిపాలిటీలో 10 వార్డులో వాటర్ ప్లాంట్ ప్రారంభం..... 
తూప్రాన్ లో చలివేంద్రం ప్రారంభించిన డీసీఎం ఓనర్స్....
హాస్టల్ విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన, నిందితులకు 3 ఏళ్ల జైలు శిక్ష: