హాస్టల్ విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన, నిందితులకు 3 ఏళ్ల జైలు శిక్ష: 

జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్

హాస్టల్ విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన, నిందితులకు 3 ఏళ్ల జైలు శిక్ష: 

 

నిందితులకు చెరో లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.2 లక్షల జరిమానా

 

తూప్రాన్, మార్చ్ 18( ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ గురుకుల హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాచ్‌మెన్ పిట్ల స్వామి, అటెండర్ బ్యాగారి శ్రీకాంత లకు కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు. విద్యార్థినుల భుజాలపై చేతులు వేయడం, వారు బట్టలు మార్చుకునే సమయంలో రహస్యంగా గమనించడం వంటి ఘటనలపై ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు.

 

ఈ ఘటనపై అప్పటి తూప్రాన్ ఎస్‌ఐ నాగార్జున గౌడ్ కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి ఐఓలు డీఎస్పీ తూప్రాన్ రాంగోపాల్ రావు, కిరణ్ కుమార్‌లు పూర్తి సాక్ష్యాలను సేకరించారు. ప్రస్తుత తూప్రాన్ ఐఓ ఎసై గంగారాజు కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య సమర్థవంతంగా వాదనలు వినిపించగా, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి ఆర్.ఎం. సుభావాలి నిందితులకు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు చెరో లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.2 లక్షల జరిమానా విధించినట్లు ఎస్పీ తెలిపారు.

 

ఈ కేసులో కోర్టు లైజనింగ్ ఆఫీసర్ విఠల్, కానిస్టేబుల్ కృష్ణ, సీడీఓ నాగరాజు, భరోసా లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ శ్వేతా తదితరులు సహకరించినట్లు ఎస్పీ వివరించారు.

 

ఈ కేసులో నిందితులకు శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్యను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Latest News