మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును కలిసిన యూత్ నాయకులు..
నార్సింగి, మార్చి 18 ( ప్రజాస్వరం ):
నార్సింగి మండలానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు పసులోటి మోతిలాల్, మన్నె కుల సంఘాల జిల్లా ఉపాధ్యక్షులు రాయిని భాను ప్రసాద్ బుధవారం మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు ను మర్యాదపూర్వకంగా కలిసి ముందస్తుగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తెలిపారు. గ్రామంలోని పలు కాలనీల్లో డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేక రోజువారీ చెత్త సేకరణ జరగక, మూడు రోజులకు ఒకసారి మాత్రమే సేకరణ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా అందించే తాగునీటి సరఫరా నెలలో నాలుగైదు సార్లు అంతరాయం కలుగుతోందని తెలిపారు. నార్సింగి జాతీయ రహదారి వెంట ఉన్న భగీరథ పైప్‌లైన్ నుండి శేరిపల్లి కి కొత్త పైప్‌లైన్ వేయించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇక మండల రెవెన్యూ శాఖ పనులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు.


