ఎడ్లకు టీకాలు వేస్తున్న గ్రామ సర్పంచ్ కొండగల్ల గణేష్ ....

ఎడ్లకు టీకాలు వేస్తున్న గ్రామ సర్పంచ్ కొండగల్ల గణేష్ ....

పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు...

 

 గజ్వెల్, మార్చి 17 (ప్రజాస్వరం):

 

పశువులకు గాలి కుంటు వ్యాధి సోకకుండా టీకాలు వేయాలని తుంకి ఖాల్సా సర్పంచ్ కొండగల్ల గణేష్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని చేపడుతామని చెప్పారు. ప్రజాప్రతినిధులకు, పశుపోషకులకు సమాచారం ఇచ్చి చాటింపు చేయించి గ్రామాలకు ఉదయాన్నే వెళ్లి పశువులకు టీకాలు వేయించాలని తెలిపారు . పశువులకు గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైందని, ఈ వ్యాధి సోకిన పశువుల నోటిలో, కాళ్లలో పుండ్లు ఏర్పడి మేత మేయక, నడవలేక నీరసిస్తాయన్నారు. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పడిపోతుందన్నారు. వ్యాధి సోకిన పశువులకు చికిత్స చేయకుంటే మరణిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Latest News