ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలని డిమాండ్..
తహసిల్దార్ కు వినతిపత్రం .....
By Prajaswaram
On
తూప్రాన్, మార్చి 18 (ప్రజాస్వరం) :
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తూప్రాన్ బిజెపి కౌన్సిలర్లు పార్టీ నాయకులు స్థానిక తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు మహిళలకు 2500 విద్యార్థినిలకు స్కూటీలు కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం వృద్ధులకు దివ్యాంగులకు పెన్షన్ పెంచి ఇస్తామన్న హామీలు ఒక్కరు కూడా నెరవేరలేదని బిజెపి నాయకులు మండిపడ్డారు కాంగ్రెస్ ప్రజలకు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఓట్లు వేసుకొని మోసం చేసిందని నాయకులు ఆరోపించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ బిజెపి అధ్యక్షులు జానకిరామ్ గౌడ్ కౌన్సిలర్లు మన్నె స్వామి చంద అశోక్.శరత్ తదితరులు పాల్గొన్నారు
Latest News
18 Mar 2026 17:27:39
నార్సింగి, మార్చి 18 ( ప్రజాస్వరం ): నార్సింగి మండలానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు పసులోటి మోతిలాల్, మన్నె కుల సంఘాల జిల్లా ఉపాధ్యక్షులు రాయిని...


