చెత్త రోడ్డు పై వేసిన షాప్ యజమానికి జరిమాన.. .
తూప్రాన్, మార్చ్ 14( ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
పారిశుధ్య కార్యకలాపాలలో బాగంగా తూప్రాన్ మున్సిపల్ పరిధిలో గల వ్యాపారస్తులు కమర్షియల్ చెత్తను మున్సిపల్ చెత్త సేకరణ వాహనానికి ఇవ్వకుండా రహదారులపైన చెత్తను పడేస్తున్న వారి షాపులపై శనివారం కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి గారి ఆదేశాలమేరకు మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించడం జరిగినది. ఇట్టి విషయమై పలు మార్లు జయ లక్ష్మి హార్డ్ వేర్ షాప్ యజమానికి హెచ్చరించినప్పటికి చెత్తను రోడ్డు పైన వేయడం గుర్తించిన అధికారులు 1000/- రూపాయల జరిమానా విధించడం జరిగినది. అనతరం కమిషనర్ గణేష్ రెడ్డి మాట్లాడుతూ తూప్రాన్ మున్సిపాలిటీని బహిరంగ ప్రదేశాలలో చెత్త పడేయకుండా ప్రజలు అందరూ కూడా సహకరించాలని, చెత్త సేకరణ వాహనాలకు ఇవ్వకుండా రోడ్ల పైన చెత్త వేసిన వారి పైన తగు చట్టపరమైన చర్యలు తీస్కుంటామని హెచ్చరించడం జరిగినది.


