జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ...
By Prajaswaram
On
మేడ్చల్ , మార్చి (ప్రజాస్వరం):
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలు మేడ్చల్ జిల్లా ఇంచార్జీ నిమ్మకాయల పెద్ది రాజు ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి, అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. యువత ముందుకు వచ్చి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలకు సేవ చేయడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Latest News
14 Mar 2026 19:45:04
రామాయంపేట, మార్చ్ 14 ( ప్రజాస్వరం ): రామాయంపేట పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో...


