రోడ్డు ప్రమాదల పై అవగాహనా...

మెదక్ జిల్లా పోలీస్ లు..

రోడ్డు ప్రమాదల పై అవగాహనా...

తూప్రాన్, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం ):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

ఉచిత వైద్యం....

మెదక్ జిల్లా పోలీస్ లు తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదాల పై డ్రైవర్లు కు అవగాహనా కలిపించారు 

“Arrive Alive” రెండవ దశ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు, పర్యవేక్షణలో తూప్రాన్ టోల్ గేట్ సమీపంలోని జిఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోడు భద్రత ప్రమాధాలు నివారణకు అవగహన కలిపించారు. ఈ కార్యక్రమాము లో డి.ఎస్.పీ తూప్రాన్ నరేందర్ గౌడ్ , సి.ఐ తూప్రాన్ రంగా కృష్ణ , సి.ఐ నర్సాపూర్ జాన్ రెడ్డి , ఎస్‌.ఐ తూప్రాన్ గంగారాజు మరియు పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. సిఎంఆర్ మరియు పుష్పగిరి ఆసుపత్రి సిబ్బంది సహకారంతో ఉచిత వైద్య శిబిరం మరియు కంటి పరీక్షా శిబిరం ఏర్పాటు చేయబడింది.

ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాస్ రావు భారీ వాహన డ్రైవర్లు, స్కూల్ బస్సు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మరియు విద్యార్థులను ఉద్దేశించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదు, వేగ పరిమితులను పాటించాలి, ట్రాఫిక్ నియమాలను అనుసరించాలి, మొబైల్ ఫోన్ వినియోగం నిషేధం, మైనర్లు వాహనాలు నడపరాదు వంటి అంశాలను వివరించారు.

పలువురు వాహనదారులు కార్యక్రమంలో పాల్గొని వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు సూచించారు.