మానవత్వం చాటుకున్న మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ సతీష్..
By Prajaswaram
On
మేడ్చల్, ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం):
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం పోలీసుల ప్రధాన కర్తవ్యమని మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బి. సతీష్ నిరూపించారు. మేడ్చల్ సమీపంలోని కండ్లకోయ జంక్షన్ వద్ద విధుల్లో ఉన్న సమయంలో ఒక నిండు గర్భిణి అక్కడి నుంచి వెళ్తూ అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయి నడవలేని స్థితిలోకి వెళ్ళింది. అది గమనించిన కానిస్టేబుల్ అమెను సమీపంలోని చెట్టు నీడలోకి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితిని పరిశీలించగా, ఆమెకు ప్రసవ వేదనలు (పెయిన్స్) వచ్చినట్లుగా అనిపించడంతో వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి, సమీపంలోని ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. కానిస్టేబుల్ సతీష్ మానవత్వాన్ని చాటి శభాష్ అనిపించుకున్నారు.
Latest News
05 Mar 2026 17:47:42
మెదక్, మార్చ్ 05 (ప్రజాస్వరం): న్యాయవాది సతీష్ పై పాపన్నపేట ఎస్ఐ చేయి చేసుకోవడం హేయమైన చర్య అని మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్కంటి రాములు...


