న్యాయవాది పై చేయి చేసుకోవడం హేయం....
ఎస్ఐ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి....
మెదక్, మార్చ్ 05 (ప్రజాస్వరం):
న్యాయవాది సతీష్ పై పాపన్నపేట ఎస్ఐ చేయి చేసుకోవడం హేయమైన చర్య అని మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్కంటి రాములు అన్నారు. గురువారం న్యాయవాది సతీష్ పై పాపన్నపేట ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ చేయి చేసుకోవడం పట్ల గురువారం మెదక్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కోర్టు ప్రధాన గేటు వద్ద న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్కంటి రాములు మాట్లాడుతూ తన కు జరిగిన రోడ్డు ప్రమాదం పైన కేసు పెట్టేందుకు వెళ్ళిన తమ సహచర న్యాయవాది నీ దుర్భాషాలు ఆడుతూ తన పైన చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాదిగా తనకు తను పరిచయం చేసుకున్నప్పటికీ తన కు జరిగిన యాక్సిడెంట్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సతీష్ పై చేయి చేసుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాడి చేసినటువంటి ఎస్సై పై ఎఫ్ఐఆర్ నమోదయ్యేంత వరకు న్యాయవాద వృత్తులను బహిష్కరిస్తూ నిరసన తెలుపడం జరుగుతుందన్నారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ తక్షణమే జోక్యం చేసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర డిజిపి, ఐజీ జోక్యం చేసుకొని పాపన్నపేట ఎస్ఐ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జనార్ధన్ రెడ్డి, ఫజల్ అలీ, జీవన్ రావు, రవీందర్, వెంకటేశం, రామ శర్మ తదితరులు పాల్గొన్నారు.


