మెదక్ ఎంపీ ని కలసిన తూప్రాన్ బీజేపీ కౌన్సిలర్ లు ...
తూప్రాన్, ఫిబ్రవరి 24 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున విజయం సాధించిన ముగ్గురు కౌన్సిలర్లు సోమవారం ఎంపీ రఘునందన్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.తూప్రాన్ మున్సిపల్ బీజేపీకి చెందిన 2వ వార్డు కౌన్సిలర్ చందా అశోక్, 7వ వార్డు కౌన్సిలర్ మన్నే స్వామి , 10వ వార్డు కౌన్సిలర్ బొల్లెం సత్యనారాయణలు తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షుడు భూమన్నగారి జానకిరామ్ గౌడ్ తో కలిసి సమావేశం అయ్యారు
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఎంపీ రఘునందన్ రావు అభినందనలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని, మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఎంపీ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పారదర్శక పాలనతో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆయన తెలిపారు.
తూప్రాన్ పట్టణ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారి మరమ్మతులు వంటి అంశాల్లో కౌన్సిలర్లు సమన్వయంతో కృషి చేయాలని ఎంపీ ఆకాంక్షించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు.


