మహిళ భవన నిర్మాణానికి స్థానిక సర్పంచ్ సంతోష్ గోండ స్వామి యాదవ్ భూమి పూజ ....
నార్సింగి, మార్చి 05 ( ప్రజాస్వరం ):
నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే మహిళ భవన నిర్మాణానికి స్థానిక సర్పంచ్ సంతోష్ గోండ స్వామి యాదవ్ భూమి పూజ నిర్వహించారు, ఈ సందర్భంగా ఎన్నికలు ఐకెపి ఎపిఎం సృజన్ స్థానిక సర్పంచ్ సంతోష లు మాట్లాడుతూ ఇజిఎస్ నిదుల ద్వారా మహిళా సంఘ భవనాలు నిర్మించుకోవడం జరుగుతుందని గ్రామాలలో మహిళలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి భవనాలు లేక అద్దె భవనాలు ఉపయోగించుకోవడం జరుగుతుందని, ఈ నెల ఆఖరి వరకు మహిళా సంఘ భవనాలను నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చుకునే విధంగా పనులు చేపట్టాలని వారు కోరారు ఈనెల 31వ తేదీ వరకు భావన నిర్మాణాలు పూర్తీ అయితే బిల్లులు కూడా ఒకేసారి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని భావన నిర్మాణానికి ముందుకు వచ్చినవారు త్వరగా భవనాలను పూర్తి చేసి వినియోగం లోకి తెచ్చుకునే విధంగా కృషి చేయాలని వారు అన్నారు, మండలంలోని ప్రతి గ్రామానికి మహిళా సంఘ భవనాలను నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్ని గ్రామాలలో కూడా పనులు ప్రారంభించి త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సంతోష గొండ స్వామి యాదవ్, ఏపిఎం సృజన్, పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్, అరుణ్ యాదవ్,నవీన్ కుమార్, మల్లేశం, మురళి, లక్ష్మీ, నవనీత, సీసీలు శోభ, శ్రీనివాస్ గౌడ్, గ్రామ సంఘం అధ్యక్షురాలు రమాదేవి, మాధురి, మంజుల, గ్రామస్తులు రవీందర్ గౌడ్, వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.


