హిందూ ముస్లింల ఐక్యత కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి...అబుల్ కలాం ఆజాద్....

మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక....

హిందూ ముస్లింల ఐక్యత కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి...అబుల్ కలాం ఆజాద్....

 మెదక్, ఫిబ్రవరి 22 (ప్రజాస్వరం):

 

హిందూ ముస్లింల ఐక్యత కోసం ఎంతగానో కృషి చేసిన మహోన్నత వ్యక్తి, విద్యావేత్త మౌలాన అబుల్ కలాం ఆజాద్ అని మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక పేర్కొన్నారు. ఆదివారం భారత స్వతంత్ర సమరయోధుడు, విద్యావేత్త, భారతరత్న అవార్డు గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని పురస్కరించుకొని మెదక్ పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తులలో ఇతను ఒక్కరని, 1940- 1946 వరకు కాంగ్రెస్ అధ్యక్షులుగా, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పని చేసి విద్యారంగంలో పలు సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ఐ ఐ టీ, విశ్వ విద్యాలయాల స్థాపనకు ఎంత గానో కృషి చేశారని అన్నారు. ఆల్ - హిలాల్, ఆల్ - బలాగ్ పత్రికల ద్వారా స్వతంత్ర ఉద్యమాన్ని ఉర్దూలో నడిపించిన మహోన్నతమైన వ్యక్తి అజాద్ అని వివరించారు. ఆయన విద్యారంగంలో చేసిన పలు సేవలకు గాను ఆధునిక భారత విద్యా వ్యవస్థ రూపకర్తలలో ఒకరిగా గుర్తించి, ఆయన మరణాంతరం భారతరత్న అవార్డును ప్రభుత్వం ప్రకటించిందనీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ అధ్యక్షులు చంద్రపాల్, కౌన్సిలర్ మన్సూర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గంగాధర్, నాయకులు బొజ్జ పవన్, గోదల సాయి, సమీయుద్దీన్, అవారి శేఖర్, గాడి రమేష్, భవాని, లలిత, రాజేశ్వరి, ఓమర్, భరత్, దీపక్, గౌడ్, దేవి సింగ్, నాగరాజు, కాజా, తదితరులు ఉన్నారు.

Latest News

వైస్ చైర్ పర్సన్ దంపతులకు మిత్రుల ఘన సన్మానం.... వైస్ చైర్ పర్సన్ దంపతులకు మిత్రుల ఘన సన్మానం....
గజ్వేల్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తాం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కర్ పద్మాబాయి నర్సింగరావు గజ్వేల్, 22 ఫిబ్రవరి (ప్రజాస్వరం ):   సిద్దిపేట జిల్లా...
హిందూ ముస్లింల ఐక్యత కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి...అబుల్ కలాం ఆజాద్....
జాతీయ స్థాయి సైన్స్ కి ఎంపికైన విద్యార్థిని అభినందించిన కలెక్టర్..
ప్రారంభమైన రామలింగేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు...
తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం లో ప్రత్యేక పూజలు.....
ప్రారంభమైన రామలింగేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు...
రాగి జావా తాగి ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత.. ..