కిష్టాపూర్ లో ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ...
తూప్రాన్, ఫిబ్రవరి 19 (ప్రజాస్వరం ):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ లో గురువారం రోజు నూతన ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ తెలంగాణ బి ఆర్ ఎస్ యువ నాయకులు వంటేరు విజయ వర్ధన్ రెడ్డి చేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ యువత శివాజీ మార్గాన్ని ఎంచుకోవాలని మద్యం కు బానిసలుగా కాకుండా సనాతన ధర్మం వైపు దైర్యం తో ముందుకు వెళ్లాలన్నారు త్వరలో కిష్టాపూర్ లో ఉమ్మడి తూప్రాన్ మండలం లోని గ్రామాల యువత తో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేస్తా అని ఆయన అన్నారు యువకులు కిష్టాపూర్ టీం కు క్రికెట్ కిట్టు ఇవ్వాలని కోరగా వెంటనే స్పందించి రెండు రోజులలో ఇప్పిస్తా అని హామీ ఇచ్చారు మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, భారతదేశ చరిత్రలో ఛత్రపతి శివాజీగా ప్రఖ్యాతి గాంచిన వీరుడు హిందువులు. అయినా శివాజీకి తల్లి జిజాబాయి హిందూ పురాణాలు, రామాయణ, మహాభారత కావ్యాలు, మరాఠీ సాహిత్యం నేర్పించ్చింది..
శివాజీ 1680 ఏప్రిల్ 3న రాజగడ్‌లో మరణించాడు. అతని మరణం తరువాత, అతని కుమారుడు సంభాజీ మరాఠా సామ్రాజ్యానికి పాలకుడు అయ్యాడుఅని ఆయన అన్నారు
శివాజీ భారతదేశ చరిత్రలో గొప్ప వీరులలో ఒకడిగా పేరు పొందినాడు. అతని విజయాలు, నాయకత్వం, హిందూ సంస్కృతి పట్ల అతని అంకితభావం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడని విజయ వర్ధన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమం లో కిష్టాపూర్ సర్పంచ్ హిమ బిందు శ్రీశైలం మాజీ జడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్ మల్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఇస్లాంపూర్ మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి మాజీ యావపూర్ ఎంపీటీసీ సంతోష్ రెడ్డి శామ్ సుందర్ రెడ్డి రవి కుమార్ మహేష్ గౌడ్ శివాజీ యువత అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు


