సరస్వతీ శిశుమందిర్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు...

సరస్వతీ శిశుమందిర్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు...

ఆదిలాబాద్ జిల్లా, ఫిబ్రవరి 19 (ప్రజాస్వరం):

 

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రము లోని స్థానిక శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల లో హిందూ సామ్రాజ్య స్థాపకుడు, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ని పురస్కరించుకొని పాఠశాల లో జయంతి వేడుకలు నిర్వహించారు.ఆచార్యులు విద్యార్థులు శివాజీ మహరాజ్ ప్రతిమకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ప్రధానాచార్యులు మరాఠీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహరాజ్ యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరిస్తూ హిందూ సామ్రాజ్య స్థాపన కోసం తన ప్రాణాలను అర్పించి ఎంతో మందికి స్ఫూర్తి దాయకం గా నిలిచి యుద్ధం లో శత్రువులను చీల్చి చెండాడి మట్టి కరిపించిన తీరును వివరించారు. ఛత్రపతి శివాజీ యొక్క గొప్పతనాన్ని,ధైర్య సాహసాలను, హిందుత్వ నిష్టను మనమంతా ఆదర్శంగా తీసుకొని భారతీయ విలువలను పెంపొందించు కోవాలనీ అన్నారు.ఆచార్యులు ఉషారాణి, భారతి,సుజాత,మంజుల,శంకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Latest News

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం... ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం...
దామరకుంట లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ  గజ్వేల్, ఫిబ్రవరి 19 (ప్రజాస్వరం): ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని సర్పంచ్ పత్తి నర్సింలు అన్నారు...
శేరిపల్లిలో ఘనంగా శివాజీ 396వ జయంతి వేడుకలు..
కిష్టాపూర్ చెక్ డ్యామ్ లో నీరులేక ఎండిపోతున్న పంటలు...... 
కిష్టాపూర్ లో ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ...
సరస్వతీ శిశుమందిర్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు...
నూతన మున్సిపల్ చైర్ పర్సన్ రజిని రవీందర్ గౌడ్ కు సన్మానం...
రోడ్డు ప్రమాదం లో బీఆర్ఎస్ కార్యకర్త....