రోడ్డు ప్రమాదం లో బీఆర్ఎస్ కార్యకర్త....

రోడ్డు ప్రమాదం లో బీఆర్ఎస్ కార్యకర్త....

తూప్రాన్, ఫిబ్రవరి 18( ప్రజాస్వరం)  :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మండలము మల్కాపూర్ ఆదర్శ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ యువ కార్యకర్త చింతల విట్టల్ (26)మంగళవారం రాత్రి చేగుంట పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విటల్ మరణ వార్త తెలుసుకొని బుధవారం మల్కాపూర్ గ్రామానికి బిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు ఒంటేరు విజయవర్ధన్ రెడ్డి చేరుకొని మృతుడు విట్టల్ అంతిమయాత్రలో పాల్గొని పాడే మోసారు. బాధిత కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ తో కలిసి అందజేశారు. భవిష్యత్తులో విట్టల్ కుటుంబాన్నికి పార్టీ అండగా ఉంటుందని విజయవర్ధన్ రెడ్డి భరోసా ఇచ్చారు. అంతిమ యాత్ర లో బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు