ఘనంగా శివపార్వతుల కళ్యాణం ......

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి...

ఘనంగా శివపార్వతుల కళ్యాణం ......

చిన్న శంకరంపేట,  ఫిబ్రవరి 18 ( ప్రజాస్వరం ):

చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం 55వ వార్షికోత్సవ వేడుకలు నాలుగు రోజులుగా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి, నేడు శివపార్వతుల కళ్యాణం ఘనంగా అంగరంగ వైభవంగా కనుల పండువగ నిర్వహించారు, స్వామివారి కల్యాణ ఉత్సవానికి మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ ఆలయ పూజారి ప్రసాద్ స్వాగతం పలికారు, సోమేశ్వరాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించే మొక్కులు చెల్లించుకున్నారు, అనంతరం కళ్యాణోత్సవం, అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నరు, స్థానిక తహశీల్దార్ తోపాటు రెవెన్యూ అధికారులు స్వామివారి కళ్యాణం లో పాల్గొన్నారు, ఉదయం హోమం స్వామి వారి కళ్యాణం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, నేడు నిర్వహించిన కళ్యాణోత్సవంలో చిన్న శంకరంపేట వర్తక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా గౌడ సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ అలంకరణ ఏర్పాటు చేశారు, అనంతరం మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి స్థానిక తహసిల్దార్ మాలతీ లతో పాటు దాతలను శాలువా మెమెంటోలతో సన్మానించారు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ సోమేశ్వర స్వామి దేవాలయం ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయని దేవాలయ అభివృద్ధి కోసం ఎండోమెంట్ ద్వారా నిధులు కేటాయించడం జరిగిందనీ, కొన్ని కారణాల వల్ల ఆ పనులు చేయలేకపోయామని దేవాలయ అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని నూతనంగా ఎన్నికైన పాలకవర్గం దేవాలయ అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి, పాటుపడాలని ఆమె తెలిపారు, సోమేశ్వర స్వామి కృప కటాక్షాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ ఉపసర్పంచ్ భానుప్రసాద్, పాలకవర్గ సభ్యులతోపాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, కుమార్ గౌడ్, లక్ష్మారెడ్డి, సత్యనారాయణరెడ్డి, రమేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ఏమ శ్రీనివాస్, చంద్రం, తదితరులు పాల్గొన్నారు.