అంగన్ వాడీ భవనాల నిర్మాణానికి స్థలం అందజేత...
By Prajaswaram
On
మాసాయిపేట, పిబ్రవరి 06(ప్రజాస్వరం):
రెండు అంగన్వాడీ భవనాల నిర్మాణానికి స్థలం అందజేసిన దాతలకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రూ.24 లక్షలతో మంజూరైన ఈ భవనాల కోసం కేశవరెడ్డి, వీరన్న కుటుంబ సభ్యులు భూమిని దానం చేశారు. దాతల సహకారం అభినందనీయమని, జూన్ నాటికి భవన నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Latest News
18 Feb 2026 20:30:50
తూప్రాన్, ఫిబ్రవరి 18 (ప్రజాస్వరం) : పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపల్ నూతన చైర్పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్ లను బిఆర్ఎస్ ప్రధాన...


