కిష్టాపూర్ చెక్ డ్యామ్ లో నీరులేక ఎండిపోతున్న పంటలు......
తూప్రాన్, ఫిబ్రవరి 19( ప్రజాస్వరం) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మండలం కిష్టాపూర్ ప్రాంతంలో హల్దీ వాగు పైన చెక్ డ్యామ్ (హల్దీవాగు) నీటిని అక్రమ ఇసుక పిలటర్లు ఏర్పాట్లు చేసి మోటార్ల ధ్వారా నీటిని తోడేయడం తో వాగు లో నిరులేక వ్యసాయ పంట లు ఎండిపోతున్నతాయని రైతులు ఆవేదన వ్యక్తి చేస్తున్నారు. రెవెన్యూ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమ ఇసుక పిలటర్లు ను సిజ్ చేయాలనీ కోరుతున్నారు.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో ప్రారంభమైన హల్దీ వాగు మేదక్ జిల్లా మీదుగా ప్రవహిస్తోంది.
తూప్రాన్, మాసాయి పేట, వెల్టుర్తి, కొల్చారం మండలాల రైతులు ఈ వాగుపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు.
రెండు జిల్లాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు.
కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తే హల్దీ వాగు రెండు పంటలకు నీరు అందిస్తుంది.
కిష్టాపూర్ శివారులో నీరు లేక ఎండిపోయిన హల్దీవాగులో పంటలు దెబ్బతిన్నాయి.
రైతులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి నీటిని విడుదల చేయాలని కోరారు. స్థానిక అధికార పార్టీ నాయకులు పట్టించుకోని నీరు విడుదల కు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


