అండగా ఉండి అభివృద్ధి చేస్తా గెలిపించండి...
కాంగ్రెస్ అభ్యర్థి కప్ప మమత మహేష్...
గజ్వేల్ మున్సిపల్ మొదటి వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కప్ప మమత మహేష్.
గజ్వేల్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):
ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే ప్రజల సంక్షేమం, పథకాలు సాధ్యం అని గజ్వేల్ మున్సిపాలిటీ ఒకటో వార్డు అభ్యర్థి కప్ప మమత మహేష్ పేర్కొన్నారు. తనను గెలిపిస్తే అండగా ఉండి అభివృద్ధి చేస్తానని ఓటర్లను అభ్యార్తించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో గురువారం రోజున కాంగ్రెస్ అభ్యర్థి కప్ప మమత మహేష్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో ఓటర్లతో కలిసి బారీ ర్యాలీ నిర్వహించారు బతుకమ్మలు ఆడారు. ఈ సందర్భంగా అభ్యర్థి మమత మహేష్ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉండే వ్యక్తిని నాకు ఓటు గెలిపించాలని కోరారు. తన గెలుపుతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందేలా శ్రమిస్తానని అభ్యర్థి పేర్కొన్నారు. ఇన్చార్జ్ కుమార్,నీరుడి స్వామి మాట్లాడుతూ గడిచిన రెండేళ్ల హయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమార్థం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలుపరుస్తుందని తెలిపారు. ఒకటో వార్డు అభ్యర్థి కప్ప మమత మహేష్ ను గెలిపించాలని కోరారు.


