శేరిపల్లిలో ఘనంగా శివాజీ 396వ జయంతి వేడుకలు..
నార్సింగి, ఫిబ్రవరి 19 ( ప్రజాస్వరం ):
నార్సింగి మండలంలోని శేరిపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో మరాఠా యోధుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ వార్డు సభ్యులు పాల్గొని శివాజీ మహారాజ్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం యువకులు గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు ప్యాడ్లు పంపించేశారు అలాగే శివాజీ పైన వ్యాసరచన పోటీ నిర్వహించి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు అరుణ్ యాదవ్, గ్రామస్తులు బాలకృష్ణ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి సంవత్సరం శివాజీ జయంతి వేడుకలు శివాజీ యూత్ వారు నిర్వహించడం చాలా సంతోషమని అందరు కూడా శివాజీ బాటలో నడవాలని హిందువులందరూ ఏకతాటిపై ఉండాలని అన్నారు. యూత్ సభ్యులు నిఖిల్ మాట్లాడుతూ వేడుకలకు విచ్చేసిన పాలకవర్గానికి వారు అభినందనలు తెలియజేశారు. వచ్చే ఏడాదిలోపు గ్రామంలో శివాజీ విగ్రహ ఏర్పాటుకు పాలకవర్గం కృషి చేయాలని, వేడుకలను విగ్రహంతో జరుపుకోవాలని వారు కోరారు, సానుకూలంగా స్పందించిన సర్పంచ్ సంతోష గొండస్వామి యాదవ్ మాట్లాడుతు తప్పకుండా విగ్రహ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తామని వారు తెలిపారు. యువకులు చూపిస్తున్న చొరవ చాలా బాగుందని యువకులు చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో నడవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంతోష గొండస్వామి యాదవ్, వార్డు సభ్యులు అరుణ్ యాదవ్, నవీన్ కుమార్, మల్లేశం, మాజీ వార్డు సభ్యులు మ్యకల శ్రీనివాస్, గ్రామస్తులు మల్లేశం, శంకర్, బాలకృష్ణ,,సంతోష్, సత్యనారాయణ, సందీప్, వేణు, యూత్ నాయకులు రవి గౌడ్, శ్రావణ్ కుమార్, పూసల నిఖిల్, నాని, రాము, నరేష్, తదితరులు పాల్గొన్నారు.


