కేసీఆర్ జాతిపిత రేవంత్ బూతు బిడ్డ ...

మాజీ మంత్రి హరీష్ రావు...

కేసీఆర్ జాతిపిత రేవంత్ బూతు బిడ్డ ...

గజ్వేల్  ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్...

గజ్వేల్, ఫిబ్రవరి 5(ప్రజాస్వరం):

గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజ్ఞాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.ఈ సభలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం,సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు,సభలో హరీష్ రావు మాట్లాడుతూ మనకు అన్నం పెట్టినవాళ్లకు మన కోసం పని చేసినవాళ్లకు ఓటు వేయాలన్నారు, గజ్వేల్ దవాఖాన ఒకప్పుడు పందులతో నిండి ఉండేది కేసీఆర్ హయాంలో అది ఎలా మారిందో ప్రజలకు తెలుసు అన్నారు,రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక బంగారం ధర ఎనబై వేల వరకు పెరిగింది కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు,ఉన్న పథకాలను కూడా ఎగ్గొట్టడం తప్ప ప్రజలకు కొత్తగా చేసిందేమీ లేదు అని విమర్శించారు,ఆడవారికి ఉచిత ప్రయాణమని చెప్పి మగవారికి డబుల్ టికెట్ వేశాడు అంటూ ఎద్దేవా చేశారు,మనకు అన్నం పెట్టింది పథకాలు అందించింది కేసీఆర్ రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని ధీమా వ్యక్తం చేశారు,రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ బూతులు తప్ప ఆయనకు పాలన రాదన్నారు, కేసీఆర్ జై తెలంగాణ అన్నాడు కానీ రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా అలా అన్నాడా అని ప్రశ్నించారు,రైతు బంధు అంశంపై మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా రైతు బంధు ఆగలేదు,ఇప్పుడు ఎందుకు ఆపారు? ఇప్పటికీ మూడు రైతు బంధు విడతలు ఎగ్గొట్టారు,ఎన్నికల తర్వాత ఇస్తానంటూ మాటలు చెబుతున్నారు అన్నారు,ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌కు లేఖ ఇస్తామని తెలిపారు,ముస్లిం సోదరుల విషయమై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు,గజ్వేల్‌లో ఒక్క తట్టెడు మట్టికూడా ఎత్తలేదు అని వ్యాఖ్యానించారు,ప్రజ్ఞాపూర్‌లో నిర్మించిన కమిటీ హాల్ ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటున్నారని సున్నం కూడా వేయని పరిస్థితి అని అన్నారు,పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తోంది,రాష్ట్రం మొత్తం ఆగమైపోయింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు,బీజేపీపై కూడా విమర్శలు చేస్తూ అక్షింతలు పంచడం తప్ప గజ్వేల్‌కు ఒక్క రూపాయి పని చేశారా అని ప్రశ్నించారు,గజ్వేల్ బాగుండాలంటే కారు గెలవాలి బీఆర్‌ఎస్ కౌన్సిలర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను దండం పెట్టి కోరుతున్నాను,మిగిలిన పనుల బాధ్యత నేనే తీసుకుని పూర్తి చేస్తా అని హరీష్ రావు అన్నారు.

Latest News

మెదక్ వైస్ చైర్మన్‌ గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ ఎన్నిక.... మెదక్ వైస్ చైర్మన్‌ గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ ఎన్నిక....
మెదక్, ఫిబ్రవరి 16 (ప్రజాస్వరం):   మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 15 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి...
మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన తుప్రాన్ నూతన పాలకవర్గ సభ్యులు ...
రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం...
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం...
తూప్రాన్ మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం... 
కార్యకర్త కూతురు పెళ్ళికి ఆర్థిక సహాయం... 
మెదక్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం.....