వైస్ చైర్ పర్సన్ దంపతులకు మిత్రుల ఘన సన్మానం....

వైస్ చైర్ పర్సన్ దంపతులకు మిత్రుల ఘన సన్మానం....

గజ్వేల్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తాం

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కర్ పద్మాబాయి నర్సింగరావు

గజ్వేల్, 22 ఫిబ్రవరి (ప్రజాస్వరం ):

 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన కళ్యాణ్ కర్ పద్మాబాయి, నర్సింగరావు దంపతులను ఆదివారం వారి మిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ పద్మాబాయి నర్సింగరావు మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు ఆశీస్సులతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలు, ముఖ్యంగా 17వ వార్డు ఓటర్ల దీవెనలతో భారీ మెజారిటీతో గెలిచినందుకు వారు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తమపై నమ్మకంతో వైస్ చైర్ పర్సన్‌గా అవకాశం కల్పించిన మాజీ మంత్రి హరీష్ రావుకు వారు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే దిశగా నిరంతరం పని చేస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్‌లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేసిన వారు తెలంగాణ రాష్ట్రంలోనే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని ముందంజలో ఉంచే విధంగా పని చేస్తామన్నారు. ఈ సంతోషకరమైన సమయంలో తమను ప్రత్యేకంగా సన్మానించిన మిత్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్రులు అమరేందర్ రావు, వెంకట్ రెడ్డి, రవి సురేందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

Latest News

వైస్ చైర్ పర్సన్ దంపతులకు మిత్రుల ఘన సన్మానం.... వైస్ చైర్ పర్సన్ దంపతులకు మిత్రుల ఘన సన్మానం....
గజ్వేల్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తాం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కర్ పద్మాబాయి నర్సింగరావు గజ్వేల్, 22 ఫిబ్రవరి (ప్రజాస్వరం ):   సిద్దిపేట జిల్లా...
హిందూ ముస్లింల ఐక్యత కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి...అబుల్ కలాం ఆజాద్....
జాతీయ స్థాయి సైన్స్ కి ఎంపికైన విద్యార్థిని అభినందించిన కలెక్టర్..
ప్రారంభమైన రామలింగేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు...
తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం లో ప్రత్యేక పూజలు.....
ప్రారంభమైన రామలింగేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు...
రాగి జావా తాగి ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత.. ..