ప్రణాళిక బద్దంగా పరీక్షలు కొనసాగించాలి....

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్...

ప్రణాళిక బద్దంగా పరీక్షలు కొనసాగించాలి....

విద్యార్థులను పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయాలి...

మెదక్, ఫిబ్రవరి 21 (ప్రజాస్వరం):

 

జిల్లాలో జరిగే పదవ తరగతి పరీక్షలు పకడ్బందీ ప్రణాళికతో నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించే చీప్ సూపర్డెంట్, డిపార్ట్మెంటల్ అధికారులకు శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్టోరేజ్ పాయింట్ నుండి పరీక్ష కేంద్రానికి ప్రశ్న పత్రాలు తీసుకుపోయే సమయంలో జాగ్రత్తలు వహించి పరీక్ష కేంద్రానికి చేరవేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ సమయంలో ప్రతి విద్యార్థిని తనిఖీ నిర్వహించిన అనంతరం పరీక్ష కేంద్రంలోనికి పంపించాలని తెలిపారు. ప్రతి పరీక్ష పరీక్ష కు సమయం ఎక్కువగా ఉన్నందున మరుసటి రోజు వచ్చే పరీక్షకు విద్యార్థులను పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, పరీక్షల విభాగం అధికారి కరుణాకర్, జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజిరెడ్డి, మండల విద్యాధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

వైస్ చైర్ పర్సన్ దంపతులకు మిత్రుల ఘన సన్మానం.... వైస్ చైర్ పర్సన్ దంపతులకు మిత్రుల ఘన సన్మానం....
గజ్వేల్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తాం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కర్ పద్మాబాయి నర్సింగరావు గజ్వేల్, 22 ఫిబ్రవరి (ప్రజాస్వరం ):   సిద్దిపేట జిల్లా...
హిందూ ముస్లింల ఐక్యత కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి...అబుల్ కలాం ఆజాద్....
జాతీయ స్థాయి సైన్స్ కి ఎంపికైన విద్యార్థిని అభినందించిన కలెక్టర్..
ప్రారంభమైన రామలింగేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు...
తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం లో ప్రత్యేక పూజలు.....
ప్రారంభమైన రామలింగేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు...
రాగి జావా తాగి ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత.. ..