రాగి జావా తాగి ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత.. ..
By Prajaswaram
On
గుట్టు చప్పుడు కాకుండా వైద్యం చేస్తున్న ఉపాధ్యాయులు..
రామాయంపేట, ఫిబ్రవరి 21 ( ప్రజాస్వరం ):
రామాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం రాగి జావా తాగిన ఆరుగురు విద్యార్థులు స్వల్ప అస్వస్థకు గురి అయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాధికారి విజయ, తహసిల్దార్ రజనీకుమారి ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. రాగి జావా తాగి అస్వస్థకు గురైన ఆరుగురు విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేదని రాగి జావాలో పురుగులు రావడం వల్ల వెంటనే స్పందించి వాటిని నేలపై పారబోస్తున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయుల మధ్య విరోధాలు ఉన్నట్టు తెలుస్తుంది, పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డిఇఓ తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు.
Latest News
22 Feb 2026 19:52:15
గజ్వేల్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తాం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కర్ పద్మాబాయి నర్సింగరావు గజ్వేల్, 22 ఫిబ్రవరి (ప్రజాస్వరం ): సిద్దిపేట జిల్లా...


