ప్రారంభమైన రామలింగేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు...
మేడ్చల్, ఫిబ్రవరి 22 (ప్రజాస్వరం):
మేడ్చల్ పట్టణంలోని ప్రత్యేక చరిత్ర గల శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. గణపతి పూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ చైర్మన్ ధాత్రిక రాధాకృష్ణ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు అంకురార్పణ చేసిన అనంతరం ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ట నిర్వహించారు. రాత్రి సందీశ్వర సేవ నిర్వహించారు. ఈ నెల 27వ తేదీ వరకు జరుగనున్నాయి. 22న భృంగీశ్వర సేవ, 23 న హంస వాహన సేవ, 24న అశ్వ వాహన సేవ, 25న కల్యాణ మహోత్సవం, 26 న గజవాహన సేవ, అగ్నిగుండాలు, 27 తేదీన రధ మహోత్సవం, లంకాదహనం నిర్వహించున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది. ఈ జాతరకు మేడ్చల్ పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు, ప్రజలు తరలివస్తారు.
అంకురార్పణ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాధాకృష్ణ తో తన కుమారుడు శ్రీనివాస్ తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


