పార్టీ బలోపేతం మరింత కృషి చేయాలి...
మెదక్, ఫిబ్రవరి 21 (ప్రజాస్వరం):
పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ వర్క్ షాప్ మెదక్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాష రావడం విచ్చేసి, వర్క్ షాప్ కు సంబంధించి తగు సూచనలు కార్యకర్తలకు అందజేశారు. పార్టీ బలోపేతం చేసేందుకు మరింత కృషి చేయాలని పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ భూచేష్ యాదవ్, కౌన్సిలర్లు శంకర్ గౌడ్, శ్రీకాంత్, నిరంజన్ దాస్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి బొక్క నరసింహారెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సర్పంచ్ శ్రీనివాస్, ఈర్ల రంజిత్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు, వార్డు కౌన్సిల్ శంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు, నర్సాపూర్ వైస్ చైర్మన్ భూచేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి కల్కి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


