ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్స్ ప్రారంభించిన సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్...
చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 21 ( ప్రజాస్వరం ):
చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తాగునీటి కోసం స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ తన సొంత డబ్బులు వెచ్చించి ఆర్వో ప్లాంటును అందజేశారు, దీంతో విద్యార్థుల తాగునీటి సమస్య తీరింది అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతుoడటంతో ఈజీఎస్ నిధుల ద్వారా మూత్రశాలలు నిర్మాణం చేపట్టారు మధ్యలోనే పనులు ఆపివేయడంతో సర్పంచ్ చొరవ తీసుకొని వాటిని పూర్తి చేసి విద్యార్థుల వినియోగంలోకి తీసుకొచ్చారు నూతనంగా ఏర్పాటు చేసిన టాయిలెట్స్ ను మరియు ఆర్వో ప్లాంట్ ను స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ ఉపసర్పంచ్ భాను ప్రసాద్ పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు, ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ చంద్రశేఖర్ ఉపసర్పంచ్ భాను ప్రసాద్,లతోపాటు పాలకవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థులు పాఠశాలకు సరిగా హాజరు కావడం లేదని పాలకవర్గ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పూర్తిస్థాయిలో పాఠశాలకు వచ్చే విధంగా కృషి చేయాలని వారు కోరారు, పాఠశాలలో ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని పాఠశాల అంటే దేవాలయాలతో సమానమని పాఠశాలల అభివృద్ధికి ఎల్లప్పుడు ముందు ఉంటానని ఆయన తెలిపారు పాఠశాలలో విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేసి కృషి చేస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి తో పాటు సర్పంచ్ చంద్రశేఖర్ ఉపసర్పంచ్ భానుప్రసాద్ పాలకవర్గ సభ్యులు రాజు రవి ఆకాష్ గౌడ్, గోపాల్, జాకీర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి తో పాటు సిబ్బంది పాల్గొన్నారు,


