కొండ పోచమ్మ రిజర్వాయర్ నుండి నీటిని వదిలిన ప్రభుత్వం....
ఇసుక ఫీల్టర్ల ధ్వసం చేసిన రెవెన్యూ అధికారులు ...
తూప్రాన్,ఫిబ్రవరి 21 (ప్రజాస్వరం ):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మండలం కిష్టాపూర్ హల్దీ వాగులో నీరులేక పంటలు ఎండుతున్నాయి అనే శీర్షిక తో వార్త రావడంతో ప్రభుత్వం స్పందించి కొండా పోచమ్మ రిజర్వాయర్ నుండి హల్ది వాగులోకి నీటిని విడుదల చేసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి అలాగే హల్ది వాగు సమీపంలో అక్రమంగా కత్రిమ ఇసుక తయారి చేస్తున్న స్థవరాలపై రెవెన్యూ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కిష్టాపూర్ హల్దీవాగు సమీపంలో అక్రమంగా కొందరు మట్టిని తవ్వి కత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. ఈ విషయంను స్పందించిన రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ ప్రేంకుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే అక్రమార్కులు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో హల్దీవాగు నుంచి అక్రమంగా నీటిని వాడుతున్న పైపులు, ఉచిత విద్యుత్‌కు వినియోగిస్తున్న వైర్లు ధ్వంసం చేశారు. అలాగే ఆ దారిదాపుల్లో విద్యుత్ సరఫరా లేకుండ చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్‌ఐ ప్రేంకుమార్ తెలిపారు. ఇకపై అక్రమంగా కత్రిమ ఇసుక తయారి చేస్తే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.


