మల్కాపూర్ లో మెగా పవర్ ట్రాన్స్ పార్మర్ ఏర్పాటు... 

మల్కాపూర్ లో మెగా పవర్ ట్రాన్స్ పార్మర్ ఏర్పాటు... 

తూప్రాన్, ఫిబ్రవరి 21( ప్రజాస్వరం ):

 

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలోని సబ్ స్టేషన్ లో శనివారం 8 మెగా వోల్టేజ్ ఆమ్స్ ను ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన 8 మెగా పవర్ ట్రాన్స్ఫార్మర్ను తూప్రాన్ విద్యుత్ ఏ ఈ వెంకటేశ్వర్లతో కలిసి గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ప్రారంభించారు. మెరుగైన విద్యుత్తు అందించేందుకు మెగా పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు, అలాగే పది సంవత్సరాల వరకు ఎలాంటి లో వోల్టేజ్ సమస్య ఉండదని ఆయన పేర్కొన్నారు. రైతుల కోసం అటు ప్రభుత్వం, ఇటు అధికారులు చేసిన కృషికి రైతులందరి తరపున సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.