ఖాజాపూర్ సర్పంచ్ బాలస్వామి కాంగ్రెస్ లో చేరిక...

ఖాజాపూర్ సర్పంచ్ బాలస్వామి కాంగ్రెస్ లో చేరిక...

చిన్న శంకరంపేట,  ఫిబ్రవరి 21 ( ప్రజస్వరం ):

చిన్న శంకరంపేట మండలంలో బీఆర్ఎస్ కు షాక్ మీద షాక్ తగులుతుంది, ఖాజాపూర్ సర్పంచ్ మన్నే బాలస్వామి తోపాటు సుమారు 80 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు, పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు భారతీయ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు, ఈ సందర్భంగా సర్పంచ్ బాల స్వామి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ తోనే సాధ్యమని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేస్తున్న అభివృద్ధిని చూసే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందని ఆయన తెలిపారు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పార్టీ ఏ పిలుపునిచ్చిన పార్టీ పిలుపుమేరకు పని చేస్తానని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాలస్వామి తో పాటు ఉపసర్పంచ్ అక్బర్, తీగుళ్ల బిక్షపతి, కుంట రాజశేఖర్, తాళ్ళ చిన్న పాండరిగౌడ్, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.