రైతులు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన...

బాల్ రెడ్డి....

రైతులు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన...

మెదక్, ఫిబ్రవరి 21 (ప్రజాస్వరం):

 

హవేలీ ఘనపూర్ మండలం ఫరీద్ పూర్ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం పైన మండల వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలని అధికంగా ఎరువులు పురుగుమందులు వాడడం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటుందని భూమి సారం తగ్గుతుందని తద్వారా పంట దిగుబడులు తగ్గుతున్నాయని అన్నారు. రైతులు జీవామృతం ఘన జీవామృతం వేస్ట్ డీకంపోజర్ వంటి ఉపయోగిస్తూ ప్రకృతి వ్యవసాయం చేయాలని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామకృష్ణ గౌడ్, వ్యవసాయం విస్తరణ అధికారి భార్గవ్, సీఆర్పీలు మౌనిక, మానస, సింధుజ, నవనీత, జి ఆర్ పి లు, ప్రమోద్, యాదగిరి, గ్రామ రైతులు పాల్గొన్నారు