గంజాయి విక్రయిస్తే చర్యలు ....
సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ ...
చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 21 ( ప్రజాస్వరం ) :
చిన్న శంకరంపేట గ్రామపంచాయతీ ఆవరణలో పంచాయతీ ఈవో ప్రదీప్ ఆధ్వర్యంలో సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు, నూతన పాలకవర్గం ఏర్పాటయ్యాక మొదటి గ్రామసభను నిర్వహించారు, గ్రామ సభకు హాజరైన గ్రామస్తులు పలు సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకుపోయారు, గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని సరిపడా నీరు ఉన్న సరిగా నీరు రావడంలేదని నీళ్లు సరఫరా అవుతున్న సమయంలో ఉదయం విద్యుత్ సరఫరా నిలిపివేయించాలని లేదంటే నల్లాలకు బిగించిన మోటార్లను తొలగించాలని గ్రామస్తులు సర్పంచ్ చంద్రశేఖర్ ను కోరారు. గ్రామ శివారులో పరిశ్రమలు ఉన్నందున గంజాయి విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మందుబాబులకు అడ్డాగా మారిందని అసాంఘిక కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు, మండల కేంద్రంలో బస్టాండ్ లేక బస్సు కోసం వేచి ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బస్టాండ్ నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు, గ్రామ శివారులో ఉన్న రాధా పరిశ్రమ నుండి వెలువడుతున్న కాలుష్యం నీటితో పంటలు ఎండిపోతున్నాయని తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు, మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సమయపాలన పాటించాలని లేదని మందులు సైతం సరిగా ఇవ్వడం లేదని గ్రామసభలో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు, గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న పరిశ్రమల ద్వారా వచ్చేటటువంటి నిధులను మరియు గ్రామపంచాయతీ ఆదాయ వ్యయ వివరాలను పంచాయతీ ఈవో ప్రదీప్ గ్రామస్తులకు చదివి వినిపించారు, నాలుగు రోజులుగా నిర్వహించిన మహాశివరాత్రి పురస్కరించుకొని సోమేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ ఉత్సవాలకు దాతల ద్వారా వచ్చిన రూపాయల వివరాలను జాతరకు సంబంధించిన ఖర్చు వివరాలను సర్పంచ్ చంద్రశేఖర్ గ్రామస్తులకు తెలిపారు, ఆరు లక్షల పైన దాతలు ఇవ్వడం జరిగిందని సుమారు 20 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగిందని దాతల సహకారంతో వచ్చిన డబ్బులు పోను మిగతా డబ్బులు తన సొంత డబ్బులు పెట్టి ఉత్సవాలను నిర్వహించిన తెలిపారు, అనంతరం సర్పంచ్ చంద్రశేఖర్ వార్డు సభ్యులు బిజెపి మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడం జరుగుతుందని గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని యువత గంజాయి సేవిస్తూ చెడు మార్గాన వెళ్లడం జరుగుతుందని ఎవరైనా గంజాయి విక్రయిస్తే అట్టి ఆధారాలు చూపిస్తే వారిని గ్రామ బహిష్కరణ చేయడం జరుగుతుందని వారు తెలిపారు, నూతనంగా ఇల్లు నిర్మించుకునే వారు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకూడదని గ్రామపంచాయతీ నాంస్ ప్రకారమే డబ్బులు చెల్లించాలని ఎవరైనా అదనంగా డబ్బులు అడిగిన ఎవరికి ఇవ్వకూడదని వారు గ్రామస్తులకు తెలిపారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్ ఉపసర్పంచ్ భాను ప్రసాద్,, రాజు, ఆలూరి రవి, ఆకాష్ గౌడ్, సునీల్, శ్యామల,తో పాటు లక్ష్మారెడ్డి, నవీన్, శ్రీనివాస్, గోపాల్, జాకీర్, వెంకట్ గౌడ్, నర్సా గౌడ్, శ్యామ్, శ్రీమన్, సాజిత్, తదితరులు పాల్గొన్నారు.


