విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి సర్పంచ్..
By Prajaswaram
On
మాసాయిపేట, ఫిబ్రవరి 24 (ప్రజాస్వరం):
చెట్ల తిమ్మాయపల్లి గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సర్పంచ్ హంసి మనోహర్ తెలిపారు. సోమవారం విద్యుత్ శాఖ లైన్మెన్ యాదగిరితో కలిసి గ్రామంలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో అవసరమైన కొత్త విద్యుత్ స్తంభాలను గుర్తించారు. వినియోగదారులకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్, వార్డు సభ్యులు బాబు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Latest News
01 Mar 2026 20:33:15
చిన్న శంకరంపేట, మార్చ్ 1 ( ప్రజాస్వరం ): చిన్న శంకరంపేట మండల పరిధిలోని అంబాజీపేట లో ఆదివారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు ఇసుఫ్...


