రాష్ట్రవ్యాప్తంగా రజకుల సంఘాల ఆందోళనలు....

రాష్ట్రవ్యాప్తంగా రజకుల సంఘాల ఆందోళనలు....

దాడికి పాల్పడిన దుండగురిని వెంటనే అరెస్టు చేసి అరెస్ట్ చేయాలి 

 

గజ్వెల్, వర్గల్ ఫిబ్రవరి 23 (ప్రజాస్వరం):

 

నాగర్ కర్నూల్ జిల్లాలో చిన్నారి ఘటన దురదృష్టకరం అని, చిన్నారి మృతికి కారణమైన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వర్గల్ రజక సంఘం నాయకులు కొవ్వత్తి వెలిగించి నిరసన చేపట్టారు.నాగర్ కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో చిన్నారి గాయపడి, మృతి చెందిన ఘటనకు నిరసనగా సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన వర్గల్ లో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు.నేటికి కులాల పేరిట చిన్నారిని దూషించి తన్నడం బాధాకరమని రజకులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి ఘటనను చూస్తే మనం ఏ కాలంలో ఉన్నామోననే భయాందోళన ఉందన్నారు. అంతేకాక చిన్నారి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేయడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశిస్తున్నారు. ఇకనైన ప్రభుత్వం చిన్నారి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో రజక సంఘం తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రమేష్ ముదిరాజ్,రజక సంఘం నాయకులు సత్యనారాయణ, పెంటయ్య, గోపాల్, వెంకటేష్, స్వామి, ఎల్లం, కృష్ణ, రాజు, తీర్మాల్, భాస్కర్,రాజు. రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

Latest News

అంబాజీపేట లో ఇఫ్తార్ విందు.... అంబాజీపేట లో ఇఫ్తార్ విందు....
చిన్న శంకరంపేట,  మార్చ్ 1 ( ప్రజాస్వరం ): చిన్న శంకరంపేట మండల పరిధిలోని అంబాజీపేట లో ఆదివారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు ఇసుఫ్...
కాళ్లకల్ లో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలి....
అమరవీరుల త్యాగాల వల్లనే వర్గీకరణ : మాదిగ హక్కుల దండోరా....
మున్సిపల్ చైర్మన్ ఆర్థిక సహాయం  ...
మల్కాపూర్ లో 390 వ స్వచ్చా భారత్.... 
యధావిధిగా ప్రతి సోమవారం ప్రజావాణి.....
ఇక పై దాడికి ప్రతి దాడి చేస్తాం.......