అమరవీరుల త్యాగాల వల్లనే వర్గీకరణ : మాదిగ హక్కుల దండోరా....

అమరవీరుల త్యాగాల వల్లనే వర్గీకరణ : మాదిగ హక్కుల దండోరా....

ఎస్సీ వర్గీకరణ కు అమరవీరుల త్యాగాలే ప్రధాన కారణం.

 

అమరవీరుల సంస్మరణ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్

 

మాదిగ హక్కుల దండోరా గజ్వెల్ నియోజకవర్గ ఇంచార్జ్ నల్ల నరేందర్

 

 గజ్వేల్, మార్చి 01 (ప్రజాస్వరం):

 

ఎస్సీ వర్గీకరణ తోపాటు, మాదిగలకు రావాల్సిన హక్కులు సాధించడానికి మాదిగ అమరుల త్యాగాలే ప్రధాన కారణమని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ అన్నారు.ఆదివారం మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో మాదిగ హక్కుల దండోరా గజ్వెల్ నియోజకవర్గ ఇంచార్జ్ నల్ల నరేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగలకు విద్య ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటే అందుకు కారకులు అమర వీరులేనని చెప్పారు. వారి త్యాగాల ద్వారా ఉద్యమాన్ని నిలబెట్టి హక్కుల సాధనకు మార్గం వేసిన మార్గ దర్శకులని కొనియాడారు. అలాంటి వీరుల త్యాగాలను మాదిగ యువత, విద్యార్థి లోకం స్మరించుకొని.. వారి ఆశయాలు కొనసాగించాలని తెలిపారు.అమరవీరుల కుటుంబాలకు ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యగం, మరియు ఇంటి స్థలం ఇవ్వాలని, ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.హైదరాబాద్ లో మాదిగ అమర వీరుల స్తూపం నిర్మించడానికి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా అధికార ప్రతినిధి ఎల్కపల్లి రాజేందర్ మాదిగ, సిద్దిపేట జిల్లా సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు బాల్ రెడ్డి,అసైడ్ భూముల జిల్లా అధ్యక్షుడు నల్ల శ్రీను, ఉప సర్పంచ్ నల్ల పరుశురాం మాదిగ, ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు గుండ్ల అశోక్, రవి, ఆదాసు సురేందర్, ఉద్దెమారి వెంకటేష్, బొగ్గుల మహేష్, తదితరులు పాల్గొన్నారు

Latest News

అంబాజీపేట లో ఇఫ్తార్ విందు.... అంబాజీపేట లో ఇఫ్తార్ విందు....
చిన్న శంకరంపేట,  మార్చ్ 1 ( ప్రజాస్వరం ): చిన్న శంకరంపేట మండల పరిధిలోని అంబాజీపేట లో ఆదివారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు ఇసుఫ్...
కాళ్లకల్ లో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలి....
అమరవీరుల త్యాగాల వల్లనే వర్గీకరణ : మాదిగ హక్కుల దండోరా....
మున్సిపల్ చైర్మన్ ఆర్థిక సహాయం  ...
మల్కాపూర్ లో 390 వ స్వచ్చా భారత్.... 
యధావిధిగా ప్రతి సోమవారం ప్రజావాణి.....
ఇక పై దాడికి ప్రతి దాడి చేస్తాం.......