ఇక పై దాడికి ప్రతి దాడి చేస్తాం.......

వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్......

ఇక పై దాడికి ప్రతి దాడి చేస్తాం.......

సిద్దిపేట స్కెచ్ మెదక్ లో అమలు.... 

మీకు బెయిల్ ఎలా వచ్చింది వారికి ఎందుకు రాలేదు....

సింపతీ కోసమే హై డ్రామా అంత......

మెదక్, మార్చి 01 (ప్రజాస్వరం):

 

మెదక్ లో ఎమ్మెల్యే వాహనం పై దాడి, నా పై జరిగిన హత్య యత్నానికి కారణం సిద్దిపేట లో వేసిన స్కెచ్ ఇక్కడ మల్లికార్జున్ గౌడ్ తన అనుచరులతో అమలు చేయించారని మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ అన్నారు. ఆదివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లడం లేదని, వాస్తవమేదో అవాస్తవమేదో ప్రజలకు చేరాల్సిన అవసరం ఉందని అన్నారు. అక్రమ అరెస్టులు దాడులు అంటున్నారని ఈరోజు జరుగుతున్న పరిణామాలన్ని ఓడిపోయిన వ్యక్తులు సింపతి పొందడానికే  చేస్తున్న కుట్రలన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాత్రి 15 వార్డు లో పదుల సంఖ్యలో మల్లికార్జున్ గౌడ్ తన అనుచరులను పెట్టుకొని మా మద్దతు దారులైన ఓ మహిళ ఇంటి ముందు చేరి భయబ్రాంతులకు గురి చేశారనే సమాచారాన్ని అందుకున్న ఎమ్మెల్యే ఆమెను పరామర్శించేందుకు రావడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే అక్కడికి వచ్చింది డబ్బులు పంచేందుకు కాదని ఆయనకు డబ్బులు పంచాల్సిన అవసరం ఏముంటుందన్నారు. తనపై దాడి జరిగిన రాత్రి ఏం జరిగిందనే వాస్తవాన్ని ప్రజలకు ఎందుకు తీసుకెళ్లలేక పోతున్నారని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే పై దాడి జరిగిన రాత్రి మల్లికార్జున్ గౌడ్ తన అనుచరులను గుంపులు గుంపులుగా ఏర్పాటు చేసి ఎవరు వస్తే వారిపై దాడులు చేసేందుకు సిద్ధమయ్యారని, సిద్దిపేటలో హరీష్ రావు వేసిన స్కెచ్ ను ఇక్కడ అమలు చేశారన్నారు. నాపై గొడ్డలి తీసుకుని భయబ్రాంతులకు గురి చేసి చంపే, కుట్ర చేశారని అన్నారు. దాడి చేసిన వారిపై ఎలాంటి పిర్యాదు చేయలేదని మీరే ఫోటో లు, వీడియోలు తీసి మీరే కదా ఫోన్ ద్వారా షేర్ చేసింది మీరు కదా అన్నారు. ఎమ్మెల్యే వాహనం పై, తన పై దాడులు జరిగిన విషయం వాస్తవం కాదా అవి మీకెందుకు కళ్లకు కనబడడం లేదు అన్నారు. ఆరోజు జరిగిన దాడిపై ఎక్కడ స్పందించకూడదని దీనికి ప్రజలే సరైన సమాధానం చెబుతున్నారని దానికి అనుగుణంగానే ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించారన్నారు. మీరు సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీడియోలో చాలా మంది ఉన్నారని మేము ఏ ఒక్కరిపై కూడా ఫిర్యాదు చేయలేదని అన్నారు. మీరు ప్రోత్సహిస్తే నాపై దాడులకు పాల్పడ్డ వ్యక్తులు లోపల ఉంటారు ఎట్లా, మీరు బయట ఉంటారు ఎట్లా అని, వారికి బెయిల్ ఎందుకు రాలేదు మీకు బెయిల్ ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. జైల్లో ఉన్న వారి కుటుంబ సభ్యుల సింపతి పొందేందుకే ఇలాంటి డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని పట్టణానికి కావాల్సిన నిధులను సైతం తీసుకు వస్తున్నారని ఇవన్నీ చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. మెదక్ నియోజకవర్గంలోని మెదక్, రామయంపేట్ మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ జెండా ఎగరడానికి స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు, మైనంపల్లి హనుమంతరావు కారణమన్నారు. ఇక మీదట కాంగ్రెస్ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే, హనుమంతరావు లపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే సహించేది లేదన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు పని చేసినట్లయితే మీకు మరోసారి ప్రజలు పట్టం కట్టే వారిని మీరు మీ కుటుంబ సభ్యులు బంధువులను మాత్రమే ప్రోత్సహించుకున్నారని అన్నారు. మీ అంతల మీరే బయటికి వచ్చి హై డ్రామా చేస్తారని, లోపలికి వెళ్లి నవ్వుకుంటురని, దీంతో ఎవరి తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటి నుండి తమ పై ఎలాంటి అసత్య ఆరోపణలు చేసిన, దాడులకు తెగబడిన దాడులకు ప్రతి దాడులు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు గంట సంపత్, హరిత, మన్సూర్, శశాంక్, పట్టణ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు రాగి అశోక్, మ్యాడమ్ బాలకృష్ణ, మేడి మధుసూదన్ రావు, లక్ష్మీనారాయణ, గోదా సాయి, తదితరులు పాల్గొన్నారు.

Latest News

అంబాజీపేట లో ఇఫ్తార్ విందు.... అంబాజీపేట లో ఇఫ్తార్ విందు....
చిన్న శంకరంపేట,  మార్చ్ 1 ( ప్రజాస్వరం ): చిన్న శంకరంపేట మండల పరిధిలోని అంబాజీపేట లో ఆదివారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు ఇసుఫ్...
కాళ్లకల్ లో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలి....
అమరవీరుల త్యాగాల వల్లనే వర్గీకరణ : మాదిగ హక్కుల దండోరా....
మున్సిపల్ చైర్మన్ ఆర్థిక సహాయం  ...
మల్కాపూర్ లో 390 వ స్వచ్చా భారత్.... 
యధావిధిగా ప్రతి సోమవారం ప్రజావాణి.....
ఇక పై దాడికి ప్రతి దాడి చేస్తాం.......