కాళ్లకల్ లో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలి....

విద్యాసాగర్ ...

కాళ్లకల్ లో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలి....

మనోహరాబాద్, మార్చి 01 ( ప్రజాస్వరం ) ;

 

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ మేజర్ గ్రామపంచాయతీలో ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలని సోషల్ వర్కర్ నేతి కుంట విద్యాసాగర్ ఒక ప్రకటనలో కోరారు. కాళ్లకల్ పారిశ్రామిక కేంద్రం కావడంతో వేలాదిమంది ప్రజలు స్థానికంగా నివాసముంటున్నారు. వివిధ రాష్ట్రాల ప్రజలు వలస వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్న ప్రాంతం కావడంతో ఆధార్ సేవలు లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆధార్ కార్డులో తొరలిన తప్పులను సరిదిద్దుకోవడంతోపాటు చేర్పులు మార్పులు చేసుకునేందుకు వీలు కల్పించేలా ఆధార్ కేంద్రం కాళ్ళకల్ లో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మేజర్ గ్రామపంచాయతీ కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా వీలుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాళ్లకల్ గ్రామంలో సబ్ పోస్ట్ ఆఫీస్ ఉండడంతో అందులోనే ఆధార్ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటుకు అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు కృషిచేసి ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమాల్లో ఉపాధి పొండుతున్న కార్మికులకు పీఎఫ్, ఈ ఎస్ ఐ పొందాలంటే కొందరి కార్మికుల ఆధార్ కార్డులలో తప్పులు వుంటున్నాయి. వాటిని సరిదిద్దుకోవాలంటే కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పులను సరిదిద్దుకోవాలంటే మేడ్చల్ లేక తూప్రాన్ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజా ప్రతి నిధులు వెంటనే స్పంధుంచాలని విజ్ఞప్తి చేషారు.

Latest News

అంబాజీపేట లో ఇఫ్తార్ విందు.... అంబాజీపేట లో ఇఫ్తార్ విందు....
చిన్న శంకరంపేట,  మార్చ్ 1 ( ప్రజాస్వరం ): చిన్న శంకరంపేట మండల పరిధిలోని అంబాజీపేట లో ఆదివారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు ఇసుఫ్...
కాళ్లకల్ లో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలి....
అమరవీరుల త్యాగాల వల్లనే వర్గీకరణ : మాదిగ హక్కుల దండోరా....
మున్సిపల్ చైర్మన్ ఆర్థిక సహాయం  ...
మల్కాపూర్ లో 390 వ స్వచ్చా భారత్.... 
యధావిధిగా ప్రతి సోమవారం ప్రజావాణి.....
ఇక పై దాడికి ప్రతి దాడి చేస్తాం.......