తూప్రాన్ మున్సిపల్ పరిధిలో గాంధీ విగ్రహం ధ్వంసం..... 

తూప్రాన్ మున్సిపల్ పరిధిలో గాంధీ విగ్రహం ధ్వంసం..... 

తూప్రాన్, మార్చ్ 5( ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ పట్టణ పరిధి తాతపాపన్ పల్లి లో మహాత్మా గాంధీ విగ్రహంపై జరిగిన దాడి నిరసిస్తూ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోవూరి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అక్కడ జరిగిన దాడిని పరిశీలన చేసి ఒక పథకం ప్రకారం మహాత్మా గాంధీ విగ్రహాలపై దాడులు జరుగుతున్నట్లుగా అనుమానం ఏర్పడింది. దాడి జరిగిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసులు వెంటనే విచారణ చేపట్టి దుండగులను గుర్తించాలని ఆయన కోరారు . అనంతరం పోలీస్ స్టేషన్ లో మహాత్మా గాంధీ విగ్రహం పై జరిగిన దాడి ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు పల్లెర్ల రవీందర్ గుప్త, ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉప్పల నర్సింలు గుప్తా, ఆర్యవైశ్య మహాసభ జిల్లా నాయకులు బుక్క అశోక్, పల్లెర్ల బాలేష్ గుప్తా, పెద్దిగారి నగేష్ గుప్త, దేవత శ్రావణ్ కుమార్, బుక్క విజయ్ కుమార్, నేతి సాగర్, ఉప్పల శ్రీకాంత్ పాల్గొన్నారు