ఒంటి పూట బడులు కోసం డీఈవో కి వినతి.....
By Prajaswaram
On
మెదక్, ఫిబ్రవరి 24 (ప్రజాస్వరం):
రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ మెదక్ జిల్లా పక్షాన మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి కి కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహ్మద్ రియాజుద్దీన్, జిల్లా అధ్యక్షులు మహ్మద్ ఇంతియజుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ యూసుఫ్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు విజయలక్ష్మి తో మాట్లాడుతూ కేవలం ఉర్దూ మీడియం పాఠశాలలే కాకుండా తెలుగు, ఇంగ్లీష్, మీడియాలలో ముస్లిం విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారని, కాబట్టి వేసవికాలం తీవ్రతరం అవుతున్న దృష్ట్యా వారికి కూడా ఒంటిపూట బడులు నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా డిఈఓ విజయలక్ష్మి సానుకూలంగా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Latest News
24 Feb 2026 19:42:46
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివి... రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేత.... మెదక్, ఫిబ్రవరి 24 (ప్రజాస్వరం): ఇందిరమ్మ రాజ్యంలోని తెలంగాణ ప్రభుత్వానికిఅభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివని...


