తూప్రాన్: మండలంలో హల్దీ వాగు నీటి ప్రవాహం...
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 24 (ప్రజాస్వరం ):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మండలంలో కిష్టాపూర్ హల్దీ వాగు చెక్ డ్యామ్ ప్రవాహం మొదలైంది. హల్దీ వాగులోని నీరు అడుగంటి పోవడంతో రైతులు కాలేశ్వరం నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మూడు రోజుల క్రితం వర్గల్ మండలంలో సంగారెడ్డి కాలువ ద్వారా హల్దీ వాగులోకి కాలేశ్వరం నీటిని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తూంకుంట నర్సారెడ్డి విడుదల చేశారు. కాళేశ్వరం నీటిని విడుదల చేయడంతో హల్దీ వాగులో సోమవారం రాత్రి తూప్రాన్ మండలంలో కిష్టాపూర్ లో చెక్ డ్యామ్ పొంగిపోరలుతుంది ఎండ కాలం లో సైతం కాళేశ్వరం నీరు కొండ పొచ్చమ్మ రిజర్వాయిర్ నుండి వ్యవసాయం కోసం నీటి ని వదలడం తో రైతులు సంతోషం వ్యక్తం చేశారు
Latest News
24 Feb 2026 19:42:46
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివి... రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేత.... మెదక్, ఫిబ్రవరి 24 (ప్రజాస్వరం): ఇందిరమ్మ రాజ్యంలోని తెలంగాణ ప్రభుత్వానికిఅభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివని...


