జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మంచి గుర్తింపు...

జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మంచి గుర్తింపు...

తూప్రాన్, ఫిబ్రవరి 24 (ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతి నిధి 

 

తూప్రాన్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల (ZPHS Boys)కు చెందిన ఆరుగురు విద్యార్థులు నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్షలో ఎంపిక కావడం అత్యంత హర్షణీయమని పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎస్. ప్రభాకర్ తెలిపారు. ఈ విజయంతో పాఠశాల విద్యా నాణ్యత, విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయుల నిబద్ధత స్పష్టంగా ప్రతిఫలించాయని ఆయన పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా మండల విద్యాధికారి డా. పర్వతి సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ విశిష్ట ఫలితం పాఠశాలలో అమలు చేస్తున్న సమర్థవంతమైన బోధనా విధానాలకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. విద్యార్థులను లక్ష్యసాధన వైపు దారితీసిన ఉపాధ్యాయుల అహర్నిశల శ్రమ ప్రశంసనీయమని పేర్కొన్నారు.

ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, సహకరించిన బోధనా సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

 

 భవిష్యత్తులో మరింత ఉన్నత ఫలితాలు సాధిస్తూ పాఠశాల ప్రతిష్ఠను మరింతగా పెంపొందించాలని ఆకాంక్షిస్తూ, విద్యార్థులు ఇలాంటి విజయాలను స్ఫూర్తిగా తీసుకుని మరింత కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest News

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి ... లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి ...
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివి... రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేత.... మెదక్, ఫిబ్రవరి 24 (ప్రజాస్వరం):   ఇందిరమ్మ రాజ్యంలోని తెలంగాణ ప్రభుత్వానికిఅభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివని...
ఒంటి పూట బడులు కోసం డీఈవో కి వినతి.....
తూప్రాన్ గజ్వేల్ రోడ్డుపై విరిగిపడిన భారీ వృక్షం ...
40 లక్షల విదేశీ మద్యం పట్టివేత... 
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన తహసిల్దార్...
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మంచి గుర్తింపు...
తూప్రాన్: మండలంలో హల్దీ వాగు నీటి ప్రవాహం...