ఆదర్శ గ్రామాన్ని సందర్శించిన శ్రీలంక ప్రజాప్రతినిధుల బృందం.... 

 ఆదర్శ  గ్రామాన్ని సందర్శించిన శ్రీలంక ప్రజాప్రతినిధుల బృందం.... 

తూప్రాన్, మార్చ్ 10 (ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని మంగళవారం శ్రీలంక దేశానికి చెందిన ప్రజా ప్రతినిధుల బృందం ఎన్ ఐ ఆర్ డి ఆధ్వర్యంలో సందర్శించారు. గత 10 సంవత్సరాలలో గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులను సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ వారికి వివరించారు. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, రాక్ గార్డెన్, డంపింగ్ యార్డ్ లను పరిశీలించారు. అంగన్వాడీల పనితీరు, జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వపరంగా అందుతున్న బెనిఫిట్స్ ను నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మల్కాపూర్ అంచలంచెలుగా అభివృద్ధి చెంది మోడల్ విలేజ్ గా మారిన తీరుతెన్నులపై శ్రీలంక ప్రజా ప్రతినిధుల బృందం సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే తూప్రాన్ మండల పరిషత్ కార్యాలయాన్ని శ్రీలంక ప్రజాప్రతినిధుల బృందం సందర్శించి అధికారుల పనితీరుపై ఆరా తీశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్, ఎన్ ఐ ఆర్ డి ప్రతినిధి ఆశాలత, ఎంపీడీవో సతీష్ ,, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, సత్యం, పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి , పాలకవర్గ సభ్యులు పిట్ల వేణు, జిన్న కృష్ణ, రేఖ, మన్నె తిరుపతి, సరితా పరమేష్ గౌడ్ ,ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు,మేకిన్ యువత, అంగన్వాడి టీచర్లు, స్వర్ణలత, లావణ్య, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

 ఆదర్శ  గ్రామాన్ని సందర్శించిన శ్రీలంక ప్రజాప్రతినిధుల బృందం....  ఆదర్శ గ్రామాన్ని సందర్శించిన శ్రీలంక ప్రజాప్రతినిధుల బృందం.... 
తూప్రాన్, మార్చ్ 10 (ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని మంగళవారం శ్రీలంక దేశానికి చెందిన ప్రజా ప్రతినిధుల...
ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎంపీడీవో....
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక....
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహారించాలి...
ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటున్న సర్పంచ్....
బోర్లు వేశారు కానీ....
న్యాయవాది పై చేయి చేసుకోవడం హేయం....