పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించండి
జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మీద రెడ్డి శెట్టి శ్రీనివాస్ ...
అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 10,000 నగదు పురస్కారం
జవహర్ నగర్, ఫిబ్రవరి 25, (ప్రజాస్వరం):
రానున్న పదవ తరగతి పరీక్షలు దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం బాలాజీ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను అందజేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు సాధించాలన్నారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పదివేల నగదు పురస్కారాన్ని అందజేస్తానన్నారు. పరీక్షలకు భయపడకుండా ఉపాధ్యాయులు సూచించిన ప్రతి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలకు హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో రెడ్డి శెట్టి మహేష్ ,ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, కోట శ్రీనాథ్ గుప్తా, గడ్డమీది విజయ్, ప్రధానోపాధ్యాయుడు మమ్మద్ ఖాజా మోయినుద్దన్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


