పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహారించాలి...
జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ...
మెదక్, మార్చ్ 08 (ప్రజాస్వరం):
గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ 60 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేయడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా చేస్తున్న యుద్ధం పేరుతో చమురు నిల్వల కొరత ఉందన్న సాకుతో గ్యాస్ ధరలు పెంచడం వల్ల ఇతర నిత్యవసర వస్తువుల ధరలు పెరగనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను తక్షణమే తగ్గించాలని అన్నారు. విశ్వ గురువును అని తనకు తాను చెప్పుకునే నరేంద్ర మోడీ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారని దుయ్యబట్టారు. అమెరికా చెప్పు చేతల్లో మన దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. రానున్న రోజుల్లో ఇరాన్ పై యుద్ధం కొనసాగితే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచనున్నారని చెప్పారు. బిజెపి ప్రభుత్వం గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని అన్నారు. అమెరికా ఏది చెబితే అది వినే విధంగా మన బలహీన ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చమురు దిగుమతులు చేసుకోవద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంపు చెపుతుండగా ఆయనకు మోడీ మోకరిళుతున్నారని అన్నారు. పెంచిన గ్యాస్ ధరల ను వెంటనే తగ్గించాలని ఆమె కోరారు.


