ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి....
మండల విద్యాధికారి దీప్లా రాథోడ్ ...
చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 27 ( ప్రజాస్వారం ):
పాఠశాలల బలోపేతా నికి పాఠశాలలో మెరుగైన విద్యాభ్యాసన ప్రక్రియ కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని మండల విద్యాధికారి దీప్లా రాథోడ్ కోరారు, చిన్న శంకరంపూడి మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో మండలంలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మండల విద్యాధికారి డీప్ల రాథోడ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల నిర్వహణకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కృషి చేయాలని ఆయన సూచించారు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లల చదువుకునే ప్రభుత్వ పాఠశాలల మనుగడ సాధించాలంటే ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ మందు తరాల వారికి అందించాలంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని దీనికోసం ఉపాధ్యాయ సంఘం నాయకుల పాత్ర కూడా అత్యంత ఆవశ్యకత ఉంటుందని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు అధ్యక్షులు హరిబాబు, ప్రధాన కార్యదర్శి నరేష్, తపస్ అధ్యక్షుడు మహేష్, ప్రధాన కార్యదర్శి శ్రీహరి, ఎస్ జీ టి యు అధ్యక్షులు మహేందర్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, టి ఆర్ టి ఎఫ్ అధ్యక్షులు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, పి ఎస్ హెచ్ఎం ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలయ్య, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, టి పి టి ఎఫ్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, పోచయ్య,, శివప్రసాద్, పిఆర్టియు తెలంగాణ అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


